చిన్న చిన్న లోపాలు ప్రేమకు అడ్డుకాదు.. మధురమైన కథ

చిన్న చిన్న లోపాలు ప్రేమకు అడ్డుకాదు.. మధురమైన కథ

ప్రతి ఒక్క మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. కాని ఆ లోపాన్ని కూడా అర్థం చేసుకోగలితే వాళ్లతో మన జీవితం ఎంతో హాయిగా గడిచిపోతుంది. అరే ఏంట్రా వీడు అలా ఉన్నాడు. వాడేంట్రా నల్లగా ఉన్నాడు. అమ్మో వాడికి ఏంటి రా అంత కోపం.. ఇలా నోటికి వచ్చినట్లు మనచుట్టూ తిరిగే వాళ్ల గురించి మాట్లాడుతూనే ఉంటాం. కాని ఒకరి గురించి మాట్లాడే ముందు మనమేంటి అన్నది ఆలోచిస్తే అలా మాట్లాడటం ఆపేస్తారు.

అందరిలాగే ఒక వ్యక్తికి గురక పెట్టి నిద్రపోయే అలవాటు ఉంది. అది పుట్టుకతోనే అతడికి ఉంది. కాని అతడు పెట్టే గురక వల్ల ఇంట్లోనూ.. బయట ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి పెళ్లి అయ్యాక కూడా తన గురక సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది గుడ్ నైట్ సినిమాలో చక్కగా చూపించారు. ఆమె ఒక అనాధ. అతడు అమ్మా, అక్కా, చెల్లి ఇలా అందరూ ఉన్న అబ్బాయి. వీరిద్దరూ ఎలా కలిశారు. పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.

ఒక సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఆ అబ్బాయి పనిచేస్తున్నాడు. అదే ఆఫీసులో పనిచేస్తున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాని ఒకరోజు ఇద్దరూ ఆఫీసు బస్సులో వెళ్తున్న సమయంలో అతడు చిన్న కునుకు తీశాడు. అప్పుడు అతడు పెట్టిన గురక శబ్ధం విని ఆ అమ్మాయి భయపడిపోయింది. ఒక్క ఐదు నిమిషాలు తట్టుకోలేని ఆ అమ్మాయి జీవితాంతం ఎలా ఉండాలి అనుకుని.. అతడికి బ్రేక్ అప్ చేప్పేసింది. కట్ చేస్తే.. మరుసటి రోజు వేరొకరితో పెళ్లి ఫిక్స్ అయ్యింది అతడికి వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంది. అంతే మనోడు దేవదాసులా మారిపోతాడు. ఇక జన్మలో నాకు పెళ్లి అయ్యే యోగం లేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

ఒకరోజు ఎలక్ట్రీషియన్ పనిచేసే తన బావతో కలిసి ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఓ బామ్మ, తాతయ్య ఉంటారు.అదే ఇంటిపై అనాధ అయిన ఓ అమ్మాయి ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి అతడికి పరిచయం అవుతుంది. ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకోవడం కలుసుకోవడం చేస్తూ ఉండేవారు. వీరిద్దరిని చూసిన బామ్మకు కూడా వీరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనిపించేది. ఆ రోజు రానే వచ్చేసింది. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లి కూడా చేసుకుంటారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మనోడి గురక సమస్య గురించి ఆ అమ్మాయికి తెలియదు. తొలి రోజు రాత్రి ఆమెకు అర్థమైపోతుంది. కాని పాపం అతడికి తెలిస్తే ఫీల్ అవుతాడని.. ఆ గురక శబ్ధంతో నిద్రపోలేక.. రాత్రంతా ఇబ్బంది పడుతూ అలాగే ఉంటుంది.

అలా కొన్ని రోజులు గడుస్తాయి. సరిగా నిద్రలేని ఆ అమ్మాయి ఆపీసులో కళ్లు తిరిగిపడిపోతుంది. డాక్టర్ వద్దకు వెళ్తే అసలు విషయం భయటపడుతుంది. సరిగ్గా నిద్రలేకపోవడం వల్లే ఇలా అయ్యిందని డాక్టర్ చెబుతాడు. అది తెలుసుకున్న ఆ అబ్బాయి ఎంతో బాధపడతాడు. ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉండటం ప్రారంభించారు. పాపం అమ్మాయి కోసం గురక పోవడానికి మనోడు పాటించని వైద్యం లేదు. కాని చివరికి ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. చివరికి విడిపోయే దాకా వస్తారు. కాని ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వాళ్లను కలుపుతుంది. ఆ అబ్బాయికి ఉన్న గురక శబ్ధం ఆమెకు నెమ్మదిగా అలవాటై పోతుంది. ఇద్దరూ సంతోషంగా కలిసిపోతారు. ఈ సినిమా చూస్తే మనలో ఎవరికి ఏ చిన్న లోపం ఉన్నా ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంటే లైఫ్ అనేది ఎంతో అద్భుతంగా సాగిపోతుందని అర్థం అవుతుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *