నాటు నాటు స్టెప్పు వేసిన ముగ్గురు ఖాన్‭లు

నాటు నాటు స్టెప్పు వేసిన ముగ్గురు ఖాన్‭లు

ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంటే మామూలుగా ఉండదు. వెడ్డింగ్ ఏ కాదు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలంతా అంబానీ ఇంట సందడి చేస్తున్నారు.ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ముగ్గురు ఖాన్‭లు. వేదికపై బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లు సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసి కనులవిందు చేశారు. చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్ పై ముగ్గురు కనిపించడం ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయగా.. వీరు ముగ్గురు కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టేప్ ను మార్చేసి కాసేపు నవ్వులు పూయించాడు సల్మాన్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *