సీఎం జగన్‭ను కార్నర్ చేసిన అక్కాచెల్లెలు

సీఎం జగన్‭ను కార్నర్ చేసిన అక్కాచెల్లెలు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాలకు తెరదింపి ఏపీసీసీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఓ వైపు ఏపీ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతూనే.. వైఎస్ కుటుంబంలో చిచ్చు రేపుతున్నారు. సీఎం జగన్‭కు వ్యతిరేకంగా షర్మిల బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్సార్ పాలనకు… జగన్ పాలనకు చాలా తేడా ఉందని.. ప్రజల్లోనే ఆమె కడిగిపారేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. అసలు ప్రజలకు ఏం చేశారని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.

తన అన్న అయిన జగన్ కు వ్యతిరేకంగా స్కెచ్ గీస్తున్న షర్మిల దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డితో సమావేశం కావడం మరింత ఆసక్తికరంగా మారింది. దాదాపు 2 గంటల పాటు సునీతతో షర్మిల సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సునీత కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని చర్చ జరుగుతోంది. వీరి సమావేశంలో బాబాయి హత్యోదంతంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అంతకుముందు జరిగిన సంఘటనలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలని సునీత మొదటి నుంచి డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఈ కేసుపై సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. సీబీఐ విచారణ కోరడం, న్యాయస్థానాలు మారడం వంటివి సునీతా చేశారు. తండ్రి మరణానికి న్యాయం జరగాలని సునీత పోరాటం చేస్తుండగా.. వాటి విషయాలను షర్మిల ఆరా తీసినట్లు చర్చ జరుగుతోంది.

మొదటి నుంచి వివేకా హత్య వెనుక జగన్ హస్తం ఉందని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. పైకి చెప్పకపోయినా.. వైఎస్ ఫ్యామిలీలోనే కొందరు దీనిపై జగన్‭ను అనుమానిస్తున్నారన్న విషయంలో సందేహం లేదు. ఇప్పుడు సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే.. షర్మిలకు మరింత బలం పెరుగుతుంది. షర్మిల, సునీతా ఇద్దరూ అన్నదమ్ముల పిల్లలే. ఇప్పుడు ఈ ఇద్దరూ ఏకమైతే.. జగన్ మరోసారి కటకటాల పాలు కావడం ఖాయమే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వైసీపీని ఈ ఇద్దరు నామరూపాలు లేకుండా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇన్నాళ్లు ఇక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి.

Related post

బస్సుయాత్రకు సీఎం జగన్ శ్రీకారం

బస్సుయాత్రకు సీఎం జగన్ శ్రీకారం

సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.
తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.
నిజం గెలిచింది కాబట్టే బాబు జైల్లో ఉన్నాడు.. కొడాలి సెటైర్లు

నిజం గెలిచింది కాబట్టే బాబు జైల్లో ఉన్నాడు.. కొడాలి సెటైర్లు

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని ఆయన అన్నారు… భువనేశ్వరి కూడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *