50 ఏళ్ల వయస్సులోనూ.. టీనేజర్‭లా కనిపిస్తున్న వెంకటేష్ హీరోయిన్

50 ఏళ్ల వయస్సులోనూ.. టీనేజర్‭లా కనిపిస్తున్న వెంకటేష్ హీరోయిన్

కొంతమంది వయస్సు మీద పడుతున్నా.. అందంగానే కనిపిస్తారు. 50 ఏళ్లు వచ్చినా.. టీనేజర్ లాగానే ఉంటారు. సెలబ్రిటీలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సన్నగా ఉన్నా.. తమకేం తక్కువ అన్నట్లే ఉంటారు. కూలీ నెంబర్ వన్ సినిమా అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు టబు.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నారు టబు. ముఖ్యంగా ఆ తర్వాత.. నాగార్జున, టబు జంటగా నటించిన నిన్నే పెళ్లడతా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి సినీ అభిమానులు.. నిన్నే పెళ్లడతా అంటే టబు పేరును టక్కున చెప్పేస్తారు. టబు హైదరాబాదీ అమ్మాయి అని చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే.. ఆమె పూర్తి పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబర్ 4న హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించింది.

అటు గ్లామరస్.. లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయినా.. టబు ఇట్టే ఒదిగిపోగలరు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలవైకుంఠపురం సినిమాలో టబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తల్లిగా ఆమె కనిపించారు. అంతేకాదు.. టబు హైట్ గా ఉండటం వల్ల ఎలాంటి హీరో పక్కనా అయినా ఆమె చూడముచ్చటగా కనిపించేవారు. 1980లో బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్రలో టబు నటించారు. ఆ తర్వాత హమ్ నే జవాన్ లో దేవానంద్‌కి కూతురిగా నటించారు. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకుంది. బోణీకపూర్ తన సంస్థలో నిర్మించిన ‘రూప్‌కీ రాణీ చోరోంకా రాజా’, ‘ప్రేమ్’ చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకొన్నారు. ‘ప్రేమ్’లో సంజయ్‌కపూర్ సరసన నటించింది టబు. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైనా.. ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబుకి ఏ మాత్రం కలిసిరాలేదు

కాని టబు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. 1987లో వెంకటేష్ హీరోగా నటించిన.. కూలీ నెంబర్ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు టబు. ఈ సినిమా సూపర్ హీట్ అయ్యింది. ఆ సమయంలో అంతా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. అంతలోనే మరోవైపు.. హిందీ చిత్రాల్లోనూ టబు మరింత బిటీ అయిపోయారు. సాజన్ చలే ససురాల్, జీత్ చిత్రాలు ఆమెని స్టార్ హీరోయిన్ ని చేశాయి. 90వ దశకమంతా టబుకి బాగా కలిసొచ్చిందనే చెప్పారు. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ ఆమె నటించారు. హిందీలో చేసిన మాచీస్ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడంతోపాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది.

టబు అనగానే తెలుగు ప్రేక్షకులు మా కథానాయికే’ అంటుంటారు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ తదితర చిత్రాల్లో నటించి అలరించారు. ఆమె తమిళంలో నటించిన కాదల్ దేశమ్ తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘనవిజయం అందుకుంది. టబు హిందీలో చేసిన చీనీకమ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందింది.

ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లండ్‌లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. అయితే.. ఆమె వ్యక్తిగతం విషయానికి వస్తే టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. నటనలో సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన టబు.. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *