మహాగణపతి నిమజ్జనానికి వేళాయే..!

మహాగణపతి నిమజ్జనానికి వేళాయే..!

  • Telangana
  • September 27, 2023
  • No Comment
  • 339

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం వీలైనంత త్వరగా ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. గణేషుడి శోభయాత్ర కోసం బాలానగర్ నుంచి ట్రాలీని రప్పించారు. ఇవాళ రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది. రాత్రి 10 గంటల నుంచి విగ్రహం తరలింపునకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి.

అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఒంటిగంట తర్వాత గణపతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కదిలించనున్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు వెల్డింగ్ పనులు చేపట్టనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా రేపు ఉదయం 9గంటల 30నిమిషాలకు ఎన్టీఆర్ మార్గ్ కు ఖైరతాబాద్ బడా గణేష్ చేరుకుంటుంది. రేపు ఉదయం 10గంటల 30నిమిషాల నుంచి 11 గంటల వరకు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల లోపు మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related post

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…
బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన చెప్పారు.…
మెగా ప్రిన్స్ ఇంట చవితి వేడుకలు

మెగా ప్రిన్స్ ఇంట చవితి వేడుకలు

తన మనవరాలు క్లీంకారతో కలిసి వినాయక చవితి పండగ చేసుకోవడం ఈసారి ప్రత్యేకమని టాలీవుడ్‌ అగ్ర నటుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *