ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాగానే.. అక్కడున్న నాయకులు, కార్యకర్తలు జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

కృష్ణా జిల్లా పరిరక్షణ ఏర్పాట్లపై.. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఆఖరికి డ్యాములకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం చేయడం కొత్త కాదని.. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామన్నారు.

తమ పోరాటం నల్గొండ సభతో ఆగిపోదని కేసీఆర్ అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు.

Related post

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

ఓటు కోసం షూటింగ్‭కు మెగా హీరో బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కారణంగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. మైసూర్ నుంచి ఓ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *