రజాకార్ టీజర్ పై కేటీఆర్ వర్సెస్ రాజాసింగ్

  • Telangana
  • September 24, 2023
  • No Comment
  • 280

తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతోంది. మొన్నటి వరకు కశ్మర్ ది ఫైల్స్ మూవీ పై వివాదం కొనసాగింది. అయితే. ఈ సినిమా వివాదాల మధ్యే విడుదలైంది. ఇప్పుడు ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో.. రజాకార్ మూవీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా.. రజాకార్ టీజర్ పై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. రజాకార్ మూవీ చూడటానికి కేటీఆర్ తనతో కలిసి రావాలని రాజాసింగ్ అన్నారు. మంత్రి కేటీఆర్‌కు నిజాం పాలన గురించిన చరిత్ర తెలియదన్నారు. తన తండ్రి‌ కేసీఆర్‌ను అడిగి కేటీఆర్.. మీర్ ఉస్బాన్ అలీ ఖాన్ అరాచకాల గురించి తెలుసుకోవాలని సూచించారు. రజాకార్ చూసిన తర్వాతనే మంత్రి కేటీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదని హీరోలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రజాకార్ టీజర్ రిలీజ్ అయితేనే.. చాలా మంది నిజాం వారసులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు.

Related post

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *