భర్త కోసం భార్య ఎదురుచూపులు

ఆమె వయస్సు 32 సంవత్సరాలు. చిన్న వయసులోనే మనవడు కూడా పుట్టేశాడు. అప్పుడే అంతా అయిపోయింది. ఇంకేముంది బరువు బాధ్యతలు లేవు. ఏదో ఉన్న కాడికి చేసుకుంటూ భర్తతో సంతోషంగా ఉండాలి అనుకుంటుంది. కాని భర్త మాత్రం సంపాదన పేరుతో ఇంటి పొట్టునే ఉండటం మానేశాడు. పోని రాత్రికి అయినా వస్తాడా అనుకుంటే అది లేదు. వారానికి ఏదో ఒకరోజు మాత్రమే ఇంట్లో ఉంటాడు. ఏదో రోజులో ఒక్కసారి వచ్చి పోతుంటాడు. అయితే.. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. సిటిలో ఒంటరిగా జీవితం గడుపుతున్నా అనే ఫీలింగ్ తో ఉండేది ఎప్పుడూ.. అలా ఓ సారి ఊరికి వెళ్లి తనతో పాటు కొడుకును కూడా తీసుకువచ్చి స్కూల్లో జాయిన్ చేసింది.

తను మాత్రం ఇంట్లోనే ఖాళీగా ఏం ఉండదు. చదువులేకపోయినా.. తనకు ఉన్న తెలివితో చిన్న ఉద్యోగం చేస్తోంది. జీవితం మీద పెద్దగా ఆశలు అయితే లేవు. కాని భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటుంది. కాని అతడు మాత్రం ఇంటికే రాడు. అలా భర్తపై దిగులు పెట్టుకుని ఓ సారి గుండెనొప్పి తెచ్చుకుంది. అప్పటినుంచి భర్త ఆమెను ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు. అది కొద్ది రోజులే మళ్లీ తంతు మామూలే అయ్యింది. ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు. ఏమన్నా అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి.. పని ఒప్పుకున్నా కదా అక్కడే ఉండాలి అని అంటాడు.

ఆమె మాత్రం పిల్లవాడిని చూసుకుంటూ అలా జీవితం గడుపుతోంది. భర్తపై అనుమానం ఉన్నా అడిగే ధైర్యం చేయలేదు. ఇలా ఎన్నిరోజులు కాలం వెళ్లదీసేది భర్త ఉండి కూడా లేని దానిలాగా బతకాలి అంటే కష్టం అని బోరును ఏడ్చేసింది. ఇంట్లో వాళ్లకి చెప్పి ఈ సారి ఏదో ఒకటి తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇంట్లో ఏ శుభకార్యం అయినా.. తన కూతురి దగ్గరికి వెళ్లాలి అన్నా ఆమెనే వెళ్లి వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక్కటే వెళ్లి వస్తది. ఒక్కసారైనా ఇద్దరం కలిసి వెళ్లాలి.. ఊరిలో బంధువుల ముందు ఇద్దరూ కలిసి మెలిసి ఉండాలని ఆమెకు ఉంటుంది. కాని భర్త మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రేమ చూపిస్తే.. ఎలా రోజు ఇంటికి రావాలని కదా అని ఆమె అంటుంది.భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని ఏ భార్యకి మాత్రం ఉండదు. కాని ఎంత బిజీ పనుల్లో ఉన్నా ఇంట్లో మనకోసం ఓ ప్రాణం ఎదురుచూస్తూ ఉంటుందని ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.

Related post

భర్తను దూరం చేసుకుని ఒంటరి అయిన మహిళ కథ

సిటీ లైఫ్ అంటే అందరికీ తెలిసిందే.. పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా పట్టించుకోని రోజులు.. గజిబిజి జీవితం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *