భర్తను దూరం చేసుకుని ఒంటరి అయిన మహిళ కథ

సిటీ లైఫ్ అంటే అందరికీ తెలిసిందే.. పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా పట్టించుకోని రోజులు.. గజిబిజి జీవితం.. హడావుడి పనులు.. తప్ప పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు.. అలాంటి ఓ రోజు కిచెన్ లో వంట చేస్తున్న నాకు బయట ఎవరో ఒక ఆవిడ స్కూటీ స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు వినిపించింది. బయటికి వెళ్లి చూశాను.. బండి స్టార్ట్ అవ్వట్లేదా అని అడిగాను. అవునండి ఆఫీస్ కి టైమ్ అయింది. బండి ఏమో స్టార్ట్ కావడం లేదు అన్నారు. మా ఆయన ఉన్నారు పిలుస్తాను అని చెప్పాను. అంతలో మా ఆయన వచ్చి ఆమె బండి స్టార్ట్ చేశారు. ఏం చేస్తారు మీరు అని అడిగాను.. కాలేజ్ లో ప్రిన్సిపల్ గా చేస్తున్నాను అని చెప్పారు. అలా పరిచయం అయిన ఆవిడ గురించి తెలుసుకోవాలని అని అనుకున్నాను.

అలా అప్పుడప్పుడు కనిపించినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రోజు వాళ్ల ఇంటికి వెళ్లాను. కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. తను మట్లాడే విధానం బాగుంది. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. మీ గురించి తెలుసుకోవాలని ఉంది చెప్తారా అని అడిగాను.. అలా మాట్లాడుతూ.. ఇంట్లో వాళ్లు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. తర్వాత చదువుకున్నాను అని చెప్పింది. పెళ్లైన కొత్తలో వాళ్ల అత్తమామ బాగానే చూసుకున్నారు అట. అసలు కథ ఆ తర్వాత మొదలైంది అని చెప్పారు. వాళ్ల భర్త లైఫ్ లో ఇంకో అమ్మాయి ఉంది అట. ఆ విషయం తెలిసినా.. పెళ్లైంది కదా ఏం చేయలేక తను ఉండిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్లకి ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో వాళ్లను చూసుకుంటోంది. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు పాప.. అలాగే తన చదువుని కంటిన్యూ చేసింది. కాని ఇంట్లో వాళ్ల సాధింపులు ఎక్కువ అయ్యాయి. భర్త సరిగా చూసుకోవడం లేదు.

చదువుకున్నాను కదా పాపను చూసుకోగలను పట్టించుకోని భర్తతో ఇంకా ఎంతకాలం సర్దుకుపోవాలి అనుకుంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అమ్మ వాళ్ల ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. గొడవలు అవుతాయి అని తెలుసు. కాని తనకు అంటూ వేరే జీవితం కావాలి అనుకుంది. భర్తను వదిలేసి వచ్చేసింది. కొన్నాళ్లు అమ్మవాళ్ల దగ్గర ఉంది. కాని వాళ్లు మాత్రం ఎన్నిరోజులు అని చూస్తారు. ఇంట్లో బంధువులు.. చుట్టుపక్కల వాళ్ల మాటలు తట్టుకోలేక కూతుర్ని హాస్టల్ లో వేసి.. సిటిలో జాబ్ చేసుకుందాం అని హైదరాబాద్ కి వచ్చేసింది. మరోవైపు కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. భర్త నుంచి విడాకులు రాకున్నా.. పాపను చూసుకోవడానికి కొంత డబ్బు.. తన పేరు మీ ఓ ఫ్లాట్ వచ్చాయి.

జాబ్ చేస్తూ చిన్న రూమ్ తీసుకుని తన జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టింది. పాపను తనకు దూరంగా హాస్టల్ లో పెట్టి చదివిస్తోంది. అయితే అదే కొన్నాళ్ల తర్వాత తనకు వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు ఓ తోడు కావాలని అనుకున్న ఆమె.. అతనికి దగ్గరైంది. అంతా బాగానే ఉంది కాని ఏదో బాధ. అతను తన కంటే వయసులో చిన్నవాడు పెళ్లి చేసుకుందామా అంటే మొహం చాటేస్తున్నాడు. అటు భర్త దగ్గరికి వెళ్లలేదు. ఇటు ఒంటరి జీవితం. ఇంట్లో వాళ్లు మాత్రం ఎన్ని రోజులు తోడుగా ఉంటారు. ప్రస్తుతం ఆమె అలా జీవిస్తోంది. అయ్యో తొందరపడ్డానే అన్ని రోజులు ఎలా ఉన్నా భరించాను.. అలాగే తన భర్తతోనే ఉంటే అయిపోయేది అని బాధ పడుతూ చెప్పింది. ఆమె కథ వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి.

ప్రతి అమ్మాయి పెళ్లి అయిన తర్వాత మహిళగా మారుతుంది. తనకు జీవితాంతం తన భర్త దగ్గర తప్ప ఇంక ఎక్కడా గౌరవం, ప్రేమ దొరకదు. కొన్ని సార్లు తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధపెడుతూనే ఉంటాయి.

Related post

భర్త కోసం భార్య ఎదురుచూపులు

ఆమె వయస్సు 32 సంవత్సరాలు. చిన్న వయసులోనే మనవడు కూడా పుట్టేశాడు. అప్పుడే అంతా అయిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *