Karthis 25th film: జపాన్ గ్రాండ్ రిలీజ్
- Entertainment
- November 9, 2023
- No Comment
- 90
జపాన్ సినిమాతో భారీ కలెక్షన్స్ పై కన్నేశాడు తమిళ హీరో కార్తి. పాన్ ఇండియా మార్కెట్ ను గట్టిగా టార్గెట్ చేశాడు ఈ యంగ్ హీరో. తెలుగు తమిళంతో పాటు.. తెలుగులో కార్తికి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జపాన్. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం నవంబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక యూఎస్ లో దాదాపు 400 కి పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.