ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తుకు ఏసీబీ ఆదేశాలు

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కేసులో ఆస్తుల జప్తుకు విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం రూ.114 కోట్ల ఆస్తులను జప్టు చేసేందుకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

ఏడు స్థిరాస్థులు అటాచ్

ఇకపోతే ఈ కేసులో ఇప్పటికే సీఐడీ ఆస్తుల అటాచ్‌కు సిద్ధమైంది. అందుకు హోంశాఖ సైతం ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తుల అటాచ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్థులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ 2గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్, ఏ 25గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చింది.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.

ఇసుక అక్రమాల కేసులో ఏ2గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా పీతల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *