కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆస్పత్రి దగ్గర భద్రతను పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయాలని చెప్పారు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ మంత్రులు పలువురు ఇప్పటికే కేసీఆర్ ను పరామర్శించారు. ఇంకొందరు బీఆర్ఎస్ నేతలు సోమాజిగూడ యశోద ఆస్పత్రికి క్యూ కట్టారు. ఇప్పటికే.. ఐఏఎస్ రిజ్వీ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.

గురువారం అర్ధరాత్రి ఫాంహౌజ్‌లో కేసీఆర్ కాలుజారి కిందపడటంతో వెన్నుముకతో పాటు కాళ్లకూ తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అదే రాత్రి హుటాహుటిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సాయంత్రం కేసీఆర్ కు వైద్యులు సర్జరీ చేయనున్నారు. తుంటి ఎముక రీప్లేస్ కోసం ఆపరేషన్ చేయనున్నారు యశోద వైద్యులు. అందుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కేటీఆర్, కేకే సహా ముఖ్యనేతలు ఆస్పత్రిలోనే ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గాయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ కు గాయం అయిందని తెలిసి ఆందోళనకు గురయ్యాను అన్నారు. కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Related post

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *