ఇకపై పర్యాటక ప్రదేశాల్లోనే పెళ్లి వేడుకలు

పెళ్లి వేడుకలు జరిపించేందుకు ప్రపంచంలో ప్రముఖ గమ్యస్థానంగా భారత్‌ను చూపించడం ధ్యేయంగా కేంద్ర పర్యాటక శాఖ భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వివాహాలతో ముడిపడిన పరిశ్రమకు ఉన్న భారీ అవకాశాలను చాటిచెప్పడం కూడా దీని ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దార్శనికతకు లోబడి దీనిని చేపట్టినట్లు వివరించాయి. కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరస్మరణీయ ప్రస్థానానికి నాంది పడిందన్నారు. అపూర్వమైన దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో పెళ్లి వేడుకలు పూర్తి చేసుకోవాలని, మధుర స్మృతులను పదిలపరచుకోవాలని కాబోయే వధూవరులకు ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 గమ్యస్థానాల గురించి వివరాలను ప్రచారంలోకి తీసుకువచ్చి.. వివాహ వేడుకలను ఎందుకు భారత్‌లో చేసుకోవాలో తెలిపేలా కార్యక్రమం కొనసాగుతుంది.

Related post

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతుకుముందు..

ఐపీఎల్‭లో కెప్టెన్ మార్పుపై రవిచంద్రన్ షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది.

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *