తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఐఆర్ఆర్ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఏ1 నిందితుడిగా చంద్రబాబు, ఏ2 నిందితుడిగా మాజీ మంత్రి నారాయణ పేర్లను చేర్చుతూ ఛార్జీషీట్ లో పేర్కొంది.

వీరిద్దరితో పాటు.. నారాలోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్ ల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఇదిలా ఉంటే.. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఐఆర్ఆర్ కేసు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

జనసేన, బీజేపీతో పొత్తు అంటూ చంద్రబాబు పాలిటిక్స్ యాక్టివ్ గా ఉన్న సమయంలో మళ్లీ ఐఆర్ఆర్ కేసు తలనొప్పిగా మారేలా ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీతో టీడీపీ పొత్తు అంశంపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన వేళ పొత్తుల అంశం గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. ఐఆర్ఆర్ అంశం తెరపైకి రావడం వెనున వైసీపీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

సీఎం జగన్‭ను కార్నర్ చేసిన అక్కాచెల్లెలు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాలకు తెరదింపి ఏపీసీసీగా..

ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తుకు ఏసీబీ ఆదేశాలు

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కేసులో ఆస్తుల జప్తుకు విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం రూ.114 కోట్ల ఆస్తులను జప్టు చేసేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *