ఐఫోన్ 15 ఫీచర్లకు ఎలాన్ మస్క్ ఫిదా
- Technology
- September 24, 2023
- No Comment
- 299
టెక్ దిగ్గజం యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15 మోడళ్లు సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన యూజర్లు అద్భుతమైన ఫీచర్లకు ఫిదా అవుతున్నారు. ఫొటోలు షేర్ చేస్తూ కొత్త ఐఫోన్ల కెమెరా సామర్థ్యాలను మెచ్చుకుంటున్నారు. వీటిని చూసి ఐఫోన్ 15 కొనుగోలు చేయాలని కోరిక చాలా మందిలో కలుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ X యజమాని ఎలాన్ మస్క్ కూడా చేరారు. ఈ దిగ్గజ వ్యాపారవేత్త ఒక ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఫోన్ 15 సిరీస్ కెమెరా క్వాలిటీతో పాటు కెమెరా స్పెసిఫికేషన్లకు మస్స్ ఫిదా అయ్యారు.