విక్రమ్-1 ప్రయోగానికి హైదరాబాద్ స్పేస్ సెంటర్ రెడీ

దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత సంవత్సరం విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం విజయవంతంతో తన రెండవ ప్రయోగానికి సిద్థమైంది హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థ. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేటు సంస్థ.. ఈ హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. పవన్ కుమార్ చందన, నాగ భరత్ దాక ఈ కంపెనీని ప్రారంభించారు. నిండా నాలుగు పదుల వయసులేని వీరు ఈ అత్యంత కష్టమైన, తీవ్ర పోటీ ఉన్న, అత్యంత ఖర్చుతో కూడిన ఈ రంగంలోకి ప్రవేశించారు.

ఇస్రో నుంచి ఇంజినీరింగ్, అంతరిక్ష సాంకేతికతలను అందిపుచ్చుకున్న వీరు 2018లో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. గత సంవత్సరం విక్రమ్-ఎస్ రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీగా చారిత్రక విజయాన్ని సాధించిన తరువాత, స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పుడు తన తదుపరి మిషన్‌ను ఈ సంవత్సరం కక్ష్యలోకి తీసుకువెళుతోంది. విక్రమ్-1 రాకెట్ ను త్వరలో ప్రయోగించబోతుంది. వివిధ రకాల పరీక్షలు, అభివృద్ధి మైలురాళ్ల ద్వారా క్రమంగా పురోగమిస్తోంది. ఇది పూర్తిగా 3D-ప్రింటెడ్ రీజెనరేటివ్ కూల్డ్ రామన్-II ఇంజిన్ పరీక్ష, ఇది ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్ కి శక్తినిస్తుంది, ఇది విక్రమ్-1 పైస్థాయి దశ. ఈ పరీక్షకు ఇస్రో మద్దతు ఇచ్చింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *