తెలంగాణకు వరాలు.. మోడీ ఎన్నికల స్టంటేనా?

ఎన్నికల సమయం వస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎవరికి వారే తమ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణలో మోదీ పర్యటనకు ముందు తర్వాత అన్నట్లుగా రాజకీయ పరిస్థితులు మారాయి. బీజేపీపై.. రాష్ట్ర బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేసేలా… మోదీ తెలంగాణకు వరాలు కురిపించారు. మిషన్ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ.. నిజామాబాద్‭కు పసుపు బోర్డు.. ములుగులో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ.. కృష్ణా జలాల లెక్క తేల్చేందుకు ట్రిబ్యునల్‭ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్‭కు పసుపు బోర్డు.. ములుగులో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ అంశాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇక 889 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యునివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు… ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై మరో 100 రూపాయల సబ్సిడీ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటివల తగ్గించిన.. 200రూపాయలతో కలిపి మొత్తం ఇప్పుడు 300 రూపాయల మేర ఉపశమనం కల్పించినట్టయ్యిందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

Related post

జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

తడిబట్టతో ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసిన అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు

తొలిసారి ఎన్నికైన మహిళా అభ్యర్థులు

తెలంగాణ ప్రజలు ఈసారి మహిళలకు పట్టం కట్టారు. ప్రధాన రాజకీయ పార్టీ నుంచి 33 మంది మహిళలు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా.. అందులో 10 మంది మహిళలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *