కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు చేయలేదు- రేవంత్

బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోడీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. కీలక బిల్లుల ఆమోదంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని చెప్పారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో విపక్ష సీఎంలపై ఈడీ దాడులు జరిగాయని.. మరి సీఎం కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు జరగలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రేవంత్. బీఆర్ఎస్ అవినీతి చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడానికి వాటాలు, మూటలే కారణమని ఆరోపించారు. కొడుకును సీఎం చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంపై కేసీఆర్ ప్రధాని మోడీతో చర్చించారని తెలిపారు. వీరిద్దరు ఒకటేనని చెప్పడానికి మోడీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు రేవంత్.

Related post

తడిబట్టతో ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసిన అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురు ఆయన ట్వీట్లలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *