ఈనెలాఖరున తెలంగాణకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో మార్పు జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీనే తెలంగాణకు వస్తున్నారు ప్రధాని. అలాగే మహబూబ్‎నగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12.00 PM గంటలకు ప్రధాని మోడీ సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. మోడీ హాజరుకానున్న ఈ సభ 2023 ఎన్నికల శంఖారావం సభగా రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ బహిరంగ సభను చాలా ప్రతిష్టత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మంది ప్రజలను సభకు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. అయితే ఈ సభా ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలైన జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షిస్తున్నారు. ఇక రాష్ర్టంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన గ్యారెంటీలపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో అవగాహనను కల్పిస్తున్నారు.

Related post

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్రృతమైంది. మోదీ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా అయోధ్యలో..

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురు ఆయన ట్వీట్లలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *