టీబీజేపీలో గ్రూపు రాజకీయాలు.. అసంతృప్తిలో సీనియర్లు

1. తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకి అసంతృప్త నేతలు బహిరంగంగా నిరసన తెలుపుతున్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్న తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. సీనియర్లను పక్కన పెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని వారు అలక బూనుతున్నారు. హైకమాండ్ తీరుపై తెలంగాణ బీజేపీలోని కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల మొదటి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో.. చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి కన్నీటి పర్యంతం అయ్యారు. వరంగల్ వెస్ట్ టికెట్ రావు పద్మకు దక్కడంతో రాకేష్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. గోషామహల్ టికెట్ కోసం విక్రమ్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో రాజాసింగ్ కు టికెట్ ఇవ్వడంతో విక్రమ్ గౌడ్ సైలెంట్ అయ్యారు. మరోవైపు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్న కాంగ్రెస్ ను వీడకపోయినా… తమ్ముడు బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల బరిలో కమలం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇన్నాళ్లు బీజేపీలో ఉన్న ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రాజగోపాల్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

2. ఇదిలా ఉంటే.. మరోవైపు మొదటి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధర్మపురి నుంచి పోటీ చేసేందుకు వివేక్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చెన్నూరు నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ చెన్నూరు నుంచి పోటీ చేసేందుకు వివేక్ ఇష్టపడడం లేదని సమాచారం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. మహబూబ్ నగర్, నారాయణపేట స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నారట. అయితే గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమెపై పార్టీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆమె కూడా ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొదటి అభ్యర్థుల జాబితాలో జితేందర్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూర్ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆయన పేరు మొదటి జాబితాలో లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. జనసేనకు కేటాయించిన టికెట్ల పైన పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఏ మాత్రం బలం లేని జనసేనకు 12 టిక్కెట్లు కేటాయించడంపై పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయాలు బీఆర్ఎస్ కు కలిసొచ్చేలా ఉన్నాయని, వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండా బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related post

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *