దత్తాత్రేయ కుమార్తెకు బీజేపీ షాక్

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి చాలా చోట్ల ఆయా పార్టీల్లోని చాలా మంది సీనియర్ నేతలు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. అందులో భాగంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి.. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఇప్పటికే ఆమె బీజేపీలో కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. బీజేపీ దత్తాత్రేయకు షాక్ ఇచ్చింది. ముషీరాబాద్ సీటు ఆశించిన దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీకి టికెట్ ఇవ్వకుండా.. పూస రాజుకి టికెట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే విజయలక్ష్మీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఆమెకు ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం.

Related post

తొలిసారి ఎన్నికైన మహిళా అభ్యర్థులు

తెలంగాణ ప్రజలు ఈసారి మహిళలకు పట్టం కట్టారు. ప్రధాన రాజకీయ పార్టీ నుంచి 33 మంది మహిళలు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా.. అందులో 10 మంది మహిళలు…

బీఆర్ఎస్, బీజేపీలు చడ్డీ గ్యాంగ్ పార్టీలు

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని…

తెలంగాణకు వరాలు.. మోడీ ఎన్నికల స్టంటేనా?

ఎన్నికల సమయం వస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎవరికి వారే తమ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడ్డాయి.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *