బీఆర్ఎస్, బీజేపీలు చడ్డీ గ్యాంగ్ పార్టీలు

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. తమపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్‭ను కాపాడలేవని అన్నారు. బీఆర్ఎస్ ను కాపాడడానికి కేంద్ర పని చేస్తుందని చెప్పారు. మరోవైపు… బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను నోటిఫికేషన్ ముందే అమలు చేయాలని కోరుతున్నామని భట్టి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూడు చడ్డీ గ్యాంగ్ పార్టీలు అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. అమిత్ షా, అసదుద్దీన్ లు ఇద్దరూ అన్నదమ్ములు లాంటి వాళ్లు అని.. ఒకరు ప్రధాని అయితే మరొకరు అదానీ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఎంఐఎంతో తమకు ఎలాంటి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము చెప్పింది ఒకటైతే బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై తమ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Related post

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ లవ్ స్టోరీ.. ఎన్ని ట్విస్టులో తెలుసా?

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియల్ లో ఉన్నప్పుడే మొదలైందట. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు సంచలనంగా మారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *