బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ డివిజన్ లో.. గొల్ల కొమురయ్య కాలనీ, గాంధీనగర్, రామస్వామి కాంపౌండ్, బర్కల్ బస్తీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్దికి కేరాఫ్ గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరిగిందని.. అభివృద్ది చేసిన పార్టీకి ఓట్లు వేసి పట్టం కట్టాలని కోరారు. ఏ బస్తీకి, ఏ కాలనీకి వెళ్ళినా ప్రజలు స్వచ్చందంగా.. మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వస్తే.. మళ్లీ అభివృద్ధి వెనక్కి పోతుందని, అమలు కాని హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు.

Related post

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలయ్ బలయ్

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, వీహెచ్‌, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *