సూర్యాపేటలో ఐటీ హబ్

  • Telangana
  • September 23, 2023
  • No Comment
  • 338

వచ్చే నెల 2వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఐటీ హబ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు శుక్రవారం మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో కలిసి ఐటీ హబ్ లో ఏర్పాటు కానున్న కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేటలో ప్రారంభం కానున్న ఐటీ హబ్ లో 9 కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళాను సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగే జాబ్ మేళాను బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. తొలుత అధికారులతో కలిసి ఐటీ హబ్ గా మార్చనున్ను పాత కలెక్టరెట్ భవనాన్ని పరిశీలించి వారం రోజుల్లో కార్పొరేట్ తరహా లో భవనాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు.

Related post

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

వంద సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం- ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో మళ్లీ అధికారం తమదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వంద సీట్లతో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల మేనిఫెస్టోను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *