అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట

  • National
  • January 22, 2024
  • No Comment
  • 52

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్రృతమైంది. మోదీ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరిగింది.

వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య.. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు అంటే.. 84 సెకన్ల అభిజిత్ దివ్య ముహుర్తంలో రాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారు మోగింది. కాటుక దిద్ది రాముడికి మోదీ నేత్రాలంకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గర్భగుడిలో పూజలు చేశారు. ఈ కమనీయ వేడుకను చూసి యావత్ ప్రపంచం పులకించిపోయింది.

సర్వంగా సుందరంగా ముస్తాబైన అయోధ్యలో.. బాలరామయ్య కొలువుదీరాడు. 500 ఏళ్ల నాటి కోట్లాది మంది చిరకాల స్వప్నం నెరవేరింది. స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక బాలరాముడి ప్రాణపతిష్ఠ మహోత్సవంలో ప్రధాని మోదీతో పాటు.. ఆలయ ప్రాంగణంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నారు.

స్వర్ణాభరణాలతో బాలరాముడి దర్శనం ముగ్ధమనోహరంగా ఉంది. రాముడి నుదుట ధగధగ మెరిసిపోతున్న వజ్రనామం కన్నులను తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడి దర్శనం భక్త కోటిని పులకరింప చేసింది. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో ఉన్న రాముడు.. ధనుర్దారి, సకలాభరణ భూషితుడై ధవళవర్ణ శిల్పశోభిత గర్భాలయంలో కొలువయ్యాడు నీలమేఘశ్యాముడు.

Related post

దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు

ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు అయోధ్యాపురిలో కొలువయ్యాడు.

జీవం ఉట్టిపడేలా బాలరాముని విగ్రహం

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టంచనున్న బాల రామయ్య రూపం భక్తులను తన్మయానికి గురి చేస్తోంది.

అయోధ్య రామాలయానికి హనుమాన్ మూవీ టీం భారీ విరాళం

అయోధ్య రామమందిరానికి హనుమాన్ మూవీ టీం భారీ విరాళం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *