అయోధ్య రామాలయానికి హనుమాన్ మూవీ టీం భారీ విరాళం

అయోధ్య రామమందిరానికి హనుమాన్ మూవీ టీం భారీ విరాళం ఇచ్చింది. ప్రతి టికెట్‌పై 5 రూపాయిలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు.

ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2లక్షల 97వేల 162 టిక్కెట్లకు గాను.. 14లక్షల 85వేల 810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత ఆదివారం వరకు విక్రయించిన 53లక్షల 28వేల 211 టిక్కెట్ల నుంచి 2కోట్ల 66లక్షల 41వేల 55 రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్‌ 150 కోట్ల మార్కును క్రాస్ చేసి 200 కోట్ల వైపు దూసుకుపోతుంది.

ఇక శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఆ మధుర క్షణాలను ఆస్వాధించేందుకు అంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇదే సమయంలో టాలీవుడ్‌లో విడుదలైన హనుమాన్‌ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం ఇప్పటికి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ల సునామీ క్రియేట్‌ చేస్తుంది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్‌ టీమ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.

Related post

దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు

ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు అయోధ్యాపురిలో కొలువయ్యాడు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్రృతమైంది. మోదీ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా అయోధ్యలో..

జీవం ఉట్టిపడేలా బాలరాముని విగ్రహం

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టంచనున్న బాల రామయ్య రూపం భక్తులను తన్మయానికి గురి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *