భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

రాజకీయాల్లోనూ కొందరు నేతలు తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలో మల్లారెడ్డి పేరు చెబితే యువతలో ఎంత జోష్ వస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే.. ఏపీలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సందర్భం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.

మాటకారి తనమే కాదు.. డ్యాన్స్ కూడా వేయగలరు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మరోసారి సందడి చేశారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. గత ఏడాది కూడా ఆయన ఇలాగే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు భోగి వేడుకల్లో భాగంగా వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‭గా మారింది.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *