తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లు

రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచీగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోడీ సెప్టెంబరు 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం ఐదున్నర గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 45 నిమిషాలకు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది. సెప్టెంబరు 24న ప్రధాని మోడీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. వీటిల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది.

Related post

తడిబట్టతో ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసిన అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *