సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురు ఆయన ట్వీట్లలో అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేసిన మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ హరీష్ రావు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే.. ఏపీ సీఎం జగన్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Related post

మేడారం జాతర విశిష్టత

తెలంగాణలో మేడారం జాతర అంటే తెలియని వారుండరు. ఈ జాతర గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

సీతక్క లైఫ్ జర్నీ

అనసూయ అలియాస్ సీతక్క తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ…

కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు చేయలేదు- రేవంత్

బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోడీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. కీలక బిల్లుల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *