నేడో రేపో నారాలోకేష్ అరెస్టు..?

  • AP
  • September 18, 2023
  • No Comment
  • 319

ఏపీలో రాజ‌కీయాల్లో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. టీడీపీ అధినేత నేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత.. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు నారాలోకేష్ కూడా అరెస్టు అవుతారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత లోకేష్ యువగళం పాద‌యాత్ర‌ను నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఆయన ప‌ర్య‌టిస్తున్నారు. పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలోనే ఆయ‌న మ‌కాం వేశారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై జాతీయ మీడియాకు లోకేష్ ఇంట‌ర్వూలు ఇచ్చారు. లీగ‌ల్‌గా ఎలా ప్రోసీడ్ అవ్వాల‌నే దానిపై సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో ఆయన చ‌ర్చించారు.

అయితే రెండ్రోజుల్లో నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతుంది. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ ఈ రాత్రికి రాజ‌మండ్రి చేరుకోనున్నారు. రాజ‌మండ్రికి రాగానే ఎయిర్‌పోర్టులోనే లోకేష్‌కి నోట‌సులు ఇచ్చి అదుపులోకి తీసుకోనున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. లోకేష్‌ని ఫైబ‌ర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ చేస్తార‌ని స‌మాచారం. మరోవైపు ఇప్పుడే తొందరపడి ఆయనను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం జ‌రుగుతుంది. చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతుంది. ఈ నేప‌థ్యంలో లోకేష్‌ని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని సీఐడీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో బెయిల్ కూడా ల‌భించింది.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.

సీఎం జగన్‭ను కార్నర్ చేసిన అక్కాచెల్లెలు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాలకు తెరదింపి ఏపీసీసీగా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *