షర్మిల రాజ్యసభకు వెళ్లడం ఖాయమేనా..?

  • Telangana
  • September 25, 2023
  • No Comment
  • 356

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. తెలంగాణ రాజన్న రాజ్యం తేవడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి తాను ఈ పార్టీని స్థాపించినట్లు షర్మిల చెబుతూ ఉండేవారు. ఆ సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్షలు పాదయాత్ర కూడా చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆలోచనతో… షర్మిల ఉన్నట్లు ఆ విషయమై అధిష్టానం పెద్దలతో చర్చలు కూడా జరిపారు. కానీ చర్చల్లో షర్మిల ఆశించిన ఫలితాలు దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలలో కీలక పాత్ర పోషించిన.. కేసి గోపాల్ చర్చలు పూర్తయ్యాయని ఇంకా నిర్ణయం షర్మిలదే అని తెల్చేశారు. కానీ షర్మిల కోరుకున్న ఎమ్మెల్యే స్థానాన్ని గాని, ఎంపీ స్థానాన్ని గాని ఇవ్వడానికి కాంగ్రెస్ పెద్దలు సుముఖంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే.. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపటంతో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనతో పాటుగా తన మద్దతుదారులకు అయిదు సీట్లు ఇవ్వాలని గతంలో షర్మిల ప్రతిపాదించారు. ఇప్పుడు అవి అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

పాలేరు సీటును షర్మిల ఆశిస్తే ఆ స్థానాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖమ్మం ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్న తరుణంలో… ఆ స్థానాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐతో పొత్తు ఉన్న నేపథ్యంలో కొత్తగూడెంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎంపీ స్థానాన్ని అయినా ఇస్తారేమో అంటే అధిష్టానం మౌనమే సమాధానం ఇస్తుంది. దీంతో షర్మిల ఏం చేయాలనే డైలమాలో ఉన్నారు. ఈ సమయంలోనే మరోసారి డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలని.. పార్టీలో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి షర్మిల పరిస్థితి గందరగోళంగా మారినట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో తెలంగాణ రాజకీయాలలో షర్మిల పాత్ర ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. షర్మిల ఎటువైపు అడుగుల వేస్తారా అనేది ఆసక్తికరంగా ఉంది.

Related post

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

సీఎం జగన్‭ను కార్నర్ చేసిన అక్కాచెల్లెలు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాలకు తెరదింపి ఏపీసీసీగా..

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *