సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభం

సూర్యాపేట పర్యటనలో భాగంగా.. మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు సీఎం కేసీఆర్. అలాగే కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను కూడా ఆయన ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని.. రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

వంద కోట్ల రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్నామని, ఇందులో అధికారుల కృషి కూడా ఎంతో ఉందని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం చాలా ఎంతో సంతోషంగా ఉందన్నారు. తలసరి ఆదాయం విషయంలో… తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని, ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు. ఆర్థిక సాంఘిక అసమానతలు పోవాలన్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.156 కోట్లు ఖర్చు అయ్యిందని కేసీఆర్ తెలిపారు.

Related post

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతుకుముందు..

ఐపీఎల్‭లో కెప్టెన్ మార్పుపై రవిచంద్రన్ షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది.

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *