18 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాలు

  • Telangana
  • September 16, 2023
  • No Comment
  • 339

హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కాంగ్రెస్ లోని కీలక నేతలంతా హాజరయ్యారు. ముసాయిదా తీర్మానంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చిస్తోందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. CWC సమావేశంలో దేశంలోని పరిస్థితుల గురించి చర్చిస్తున్నామన్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, భద్రతా బెదిరింపులు దేశానికి పెను సవాళ్లను విసురుతున్నాయన్నారు.

2. ఇండియా కూటమి సమావేశాలు విజయం కావడంతో.. బీజేపీ ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశం తీవ్రమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. స్థానికంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు.. భారత ప్రగతిశీల, లౌకిక ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ లో జరుగుతోన్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు.

Related post

సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురు ఆయన ట్వీట్లలో…

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు- వివేక్ వెంకటస్వామి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని… అందరి సమిష్టి కృషితో వచ్చిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *