హైదరాబాద్‭లో హై అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు

  • Telangana
  • September 16, 2023
  • No Comment
  • 377

రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అధికారికంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్, రాజభవన్‌లో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మరోవైపు నగరంలో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్, తుక్కుగూడలో విజయ భేరి సభ నిర్వహిస్తున్నారు. దీంతో నగరం రోడ్లపై వీఐపీలతో సందడి నెలకొంది. దీంతో జంట నగరాల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు నగర పోలీసులు విధించారు.

ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర మంత్రి అమిత్ షా సభ ఉండడం వల్ల రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు… సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్న రోడ్డు నుంచి సీటీవో నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. ప్లాజా ఎక్స్‌ రోడ్ నుంచి ఎస్.బీ.ఐ ఎక్స్-రోడ్ రోడ్డు మూసి వేయనున్నారు. వైఎంసీఏ ఫ్లై ఓవర్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ అనుమతించనున్నారు. బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ నుంచి టీవోలి వైపు వచ్చే ట్రాఫిక్ బ్రూక్‌ బాండ్ వద్ద సీటీవో వైపు మళ్లించనున్నారు. కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్.బీ.హెచ్-పాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకర్ ఉపకార్ వద్ద టివోలి-బ్రూక్ బాండ్ వైపు మళ్లించనున్నారు. టీవోలి ఎక్స్-రోడ్‌ నుంచి ప్లాజా ఎక్స్-రోడ్‌ల మధ్య రోడ్డు రెండు వైపులా మూసివేయనున్నారు.

Related post

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు- వివేక్ వెంకటస్వామి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని… అందరి సమిష్టి కృషితో వచ్చిన…

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన చెప్పారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *