రేవంత్ లవ్ స్టోరీ.. ఎన్ని ట్విస్టులో తెలుసా?

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియల్ లో ఉన్నప్పుడే మొదలైందట.

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు సంచలనంగా మారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో.. అందుకు కారణమైన రేవంత్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ముక్కుసూటి వ్యక్తిత్వంతో రెబల్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ గురించి ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే లవ్ స్టోరీ నడిపారు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. సినిమాను మించిన ట్విస్టులతో చివరకు పెద్దలను ఒప్పించి తన ప్రేయసి గీతా రెడ్డిని ఆయన వివాహం చేసకున్నారు. రేవంత్ రెడ్డి, గీతారెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియట్‌లోనే మొదలైందట. నాగార్జునసాగర్‌లో ఇద్దరూ మెుదటి సారి కలిశారట. అక్కడ మొదలైన పరిచయం మంచి స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డే ప్రొపోజ్ చేయగా.. ఆయన వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. చాలా ఇంటర్వ్యూల్లో వారి ప్రేమ వివాహం గురించి గీతారెడ్డినే స్వయంగా చెప్పారు. వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 1992లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

ఇక ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రేవంత్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకున్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్.. కాంగ్రెస్‌ను జీరో నుంచి హీరోగా చేశారు. తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. చిన్నప్పటి నుంచే స్టూడెంట్ లీడర్‌గా చురుగ్గా వ్యవహరించిన రేవంత్.. ఆ తర్వాత ఇండిపెండెంట్ ZPTC, MLC, రెండుసార్లు MLA, MP, ఇప్పుడు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Related post

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *