యోగీ కాళ్లు పట్టుకున్న రజినీకాంత్.. అందుకేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్‌ మువీ జైలర్‌ బాక్సాఫీస్‌ వద్ద షేక్‌ చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మరో వైపు తలైవా ఈ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆయన హిమాలయాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజినీ ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా పర్యటిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి యాక్షన్‌ థ్రిల్లర్‌ మువీ జైలర్ చూసేందుకు శుక్రవారం లక్నో వెళ్లారు. సీఎం యోగితో కలిసి ఈ మువీ చూడనున్నట్లు ఆయన యూపీ పర్యటనకు ముందు వెల్లడించారు.

ఈ సందర్భంగా శనివారం లక్నోలోని సీఎం యోగి నివాసంలో కలుసుకుని ఎవరూ ఊహించని విధంగా ఆయన కాళ్లకు నమస్కరించారు రజినీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన రజనీ అభిమానులు కొందరు రజనీ తీరును తప్పుబడుతున్నారు. మరికొందరైతే సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అసలు రజినీకాంత్‌ ఎందుకలా చేశారనే దానిపై నెట్టింట పెద్ద చర్చనే జరుగుతోంది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు రజనీ నమస్కరించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related post

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతుకుముందు..

ఐపీఎల్‭లో కెప్టెన్ మార్పుపై రవిచంద్రన్ షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది.

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *