చెరుకు రైతులకు రూ.14 కోట్ల బకాయిలు

జహీరాబాద్ చెరుకు రైతులకు తీపి కబురు అందింది. ప్రతి ఏటా ఇక్కడ ఉన్న ట్రెండేట్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈసారి ఉపశమనం దక్కింది. మంత్రి హరిష్ రావు ఆ పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆ ప్రాంత చెరుకు రైతులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ అంటేనే చెరుకు పంటకు ఫేమస్‌. ఈ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పంటను సాగు చేస్తారు ఇక్కడి రైతులు. వేల ఎకరాల్లో ఇక్కడ చెరుకు సాగు అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ట్రెండేట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో రైతులకు గతకొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చెరుకు పంటను కొనుగోలు చేసిన కంపెనీ డబ్బులు ఇవ్వని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి ఏటా క్రషింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు పెట్టేవారు. ఒక దశలో ఈ కంపెనీ పెట్టిన ఇబ్బందులకు, ఈ ప్రాంత చెరుకు రైతులు చెరుకు పంట వేయడం ఆపేయాలని నిర్ణయించుకున్నారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి..రానున్న సీజన్ లో ట్రెడెం ట్ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. కేన్ కమిషనరేట్ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో మంత్రి హరీష్ రావు ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో ఈ సారి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.. మరోవైపు రైతులకు ఇవ్వాల్సి బకాయిలు 14.15 కోట్ల రూపాయలను విడతల వారీగా చెల్లించేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. దీంతో జిల్లాలో చెరకు సాగు చేస్తున్న రైతులకు కొంత మేర భరోసా కలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Related post

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతుకుముందు..

ఐపీఎల్‭లో కెప్టెన్ మార్పుపై రవిచంద్రన్ షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది.

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *