ఢిల్లీ నుంచి రాగానే నారాలోకేష్ అరెస్టు..!

  • AP
  • September 27, 2023
  • No Comment
  • 373

నారా లోకేష్ చుట్టూ ఏపీ సర్కార్ ఉచ్చు బిగిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. నారా లోకేష్ ను ఏ14గా చూపుతూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ.. సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు నారా లోకేష్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది.

ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది. వరుస కేసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని.. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ని ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా.. ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఉండవల్లి కరకట్టపై ఇల్లు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు భూములు క్విడ్ ప్రోకోగా దక్కాయని సీఐడీ ఆరోపిస్తోంది.

టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద.. గతేడాది ఏప్రిల్‌లోనే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఇప్పటికే ఏ1గా చేర్చింది సీఐడీ. నారాయణను ఏ2గా చేర్చింది. ఇప్పుడు ఇదే కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.

ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తుకు ఏసీబీ ఆదేశాలు

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కేసులో ఆస్తుల జప్తుకు విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం రూ.114 కోట్ల ఆస్తులను జప్టు చేసేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *