పార్లమెంట్‭లో టీడీపీ ఎంపీల నిరసన

  • AP
  • September 18, 2023
  • No Comment
  • 352

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనకు దిగారు. ఎంపీలతో కలిసి నారా లోకేష్, టీడీపీ నేతలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఏపీని రక్షించాలి అంటూ ఎంపీ నినాదాలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా పార్టీలకు అతీతంగా పార్లమెంట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు.. ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా తుంగలో తొక్కారో ప్రజలకు తెలియజేయాలని.. కేవలం ఎన్నికల సమీపిస్తున్నాయని ప్రతిపక్ష నేతపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. బాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని.. ఏపీ జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేసేందుకు నిరసన చేస్తున్నామన్నారు. 45ఏళ్లు ఎలాంటి మచ్చలేని చంద్రబాబు చరిత్రను నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.

ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తుకు ఏసీబీ ఆదేశాలు

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కేసులో ఆస్తుల జప్తుకు విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం రూ.114 కోట్ల ఆస్తులను జప్టు చేసేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *