రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు: చంద్రబాబు

  • AP
  • August 20, 2023
  • No Comment
  • 379

ఏపీలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రైతుల కష్టాలు, సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. శనివారం ఒక్కరోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడటంపై… తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజులో, ఒకే జిల్లాలో నలుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారంటే రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించారు. సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతలను కోల్పోయిన పరిస్థితిని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాలు, చర్యల ద్వారా రైతులు, కౌలు రైతులకు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు.

Related post

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతుకుముందు..

ఐపీఎల్‭లో కెప్టెన్ మార్పుపై రవిచంద్రన్ షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది.

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *