ప్రజాదర్బార్‭లో సీఎం రేవంత్ రెడ్డికి వినతులు

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్‭కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

ప్రజాభవన్ వేదికగా జరిగిన ప్రజాదర్బార్ కు వేలాదిమంది బాధితులు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్ లో నిలబడి.. సీఎం రేవంత్ రెడ్డికి సమస్యలను చెప్పారు. అంతేకాకుండా.. వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్ లో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి.. 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి , ప్రజాదర్బార్ లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి వినతులతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది. దీంతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Related post

జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *