రేపటి నుంచే మహాలక్ష్మీ పథకం అమలు

సోనియా పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. సోనియమ్మకు గిఫ్ట్ ఇస్తానని చెప్పిన రేవంత్ దాన్ని నిజం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పనిలో ఉన్నారు రేవంత్. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు RTC కసరత్తు చేస్తోంది.

ఆరు గ్యారంటీలలో ముందుగా రెండింటిని అమలు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలోఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. తమిళనాడులో కేవలం నగర, పట్టణప్రాంతాల్లోని సీటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఆ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో బస్సుల్ని అందుబాటులోకి తెచ్చారు. కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకోసం మహిళలంతా స్మార్ట్‌కార్డ్‌ల కోసం అప్లై చేసుకోవాలని సూచించింది. అవి వచ్చే వరకు ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపుకార్డుతో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.

Related post

జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *